డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతా పునరుద్ధరణ

డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతా పునరుద్ధరణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌  ఖాతాను పునరుద్ధరించినట్లు ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ట్విటర్‌లో పోలో నిర్వహించగా, 15 కోట్ల మంది పాల్గొన్నారని,  వారిలో 51.8 శాతం మంది ట్రంప్‌ ఖాతా పునరుద్ధరణకు అనుకూలంగా ఓటు వేశారని వివరించారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు 2021 జనవరి 6న క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి పాల్పడిన ఘటన తర్వాత ట్రంప్‌ ఖాతాను ట్విటర్‌ శాశ్వతంగా తొలగించింది. సొంతంగా ట్రూత్‌ సోషల్‌ అనే మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ను రూపొందించన్ను ట్రంప్‌ మళ్లీ ట్విటర్‌ ఖాతాను వాడుతారా? లేదా? అనేది నెట్టింట చర్చనీయాంశమైంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.