తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భూయాన్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు సిజెగా ఉన్న సతీష్‌ చంద్ర మిశ్రాను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలిజియం బదిలీలను సిఫార్సు చేసింది. ఉజ్జల్‌ గతంలో గౌహతి హైకోర్టుకు అడిషనల్‌ జడ్జిగా, 2019లో బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. ముంబైలో రెండు సంవత్సరాలు పనిచేసిన ఆయన 2021 అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉజ్జల్‌ భూయాన్‌ తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కూడా కొనసాగుతున్నారు. తెలంగాణలో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

 

Tags :