జూలియన్ అసాంజే అప్పగింతకు యూకే ఓకే

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు బ్రిటన్ హోంమంత్రి (ఇంటర్నల్ మినిస్టర్) ఆమోద ముద్ర వేశారు. అసాంజేపై అమెరికాలో దాదాపు 18 కేసులు ఉన్నాయి. వికీలిక్స్ ద్వారా అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక పత్రాలను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. పదేండ్లుగా అసాంజే న్యాయం కోసం పోరాడుతున్నారు. కాగా అసాంజే లండన్ హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 14 రోజుల గడువు ఉంటుంది. ఆ తర్వాత తన కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరవచ్చు. ఒకవేళ అక్కడ కోర్టు తిరస్కరిస్తే 28 రోజుల్లోగా అమెరికాకు అప్పగించాల్సి ఉంటుంది.
Tags :