రష్యాకు ఎదురుదెబ్బ ... క్రిమియాలో

రష్యాకు ఎదురుదెబ్బ ... క్రిమియాలో

ఉక్రెయిన్‌ నుంచి 2014లో రష్యా ఆక్రమించిన క్రిమియా ద్వీపంలో జరిగిన భారీ పేలుళ్లు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ ఘటనలో సాకీ వైమానిక స్థావరంలోని 9 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్‌ పేర్కొంది. దీన్ని రష్యా ఖండించింది. ఒక్క విమానానికీ నష్టం జరగలేదని వివరణ ఇచ్చింది. మందుగుండు డిపోలో ప్రమాదం కారణంగా పేలుళ్లు సంభవించాయ, ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 13 మందికి గాయాలయ్యాయని, అంతకు మించి నష్టం వాటిల్లదేని ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్‌ దాడుల కారణంగానే ఈ విమానాలు ధ్వంసమయ్యాయని వార్తలు వస్తున్నాయి. కీవ్‌ వర్గాలు మాత్రం ఈ ఘటనకు తమకు సంబంధం లేదని తెలిపాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిమియాతోనే రష్యా ఆక్రమణ ప్రారంభమైందని, మళ్లీ ఆ ద్వీపాన్ని వశం చేసుకోవడంతోనే యుద్ధాన్ని అంతం చేస్తామని అన్నారు.

 

Tags :