అణు కేంద్రాలపై కొనసాగుతున్న రష్యా దాడులు

అణు కేంద్రాలపై కొనసాగుతున్న రష్యా దాడులు

ఉక్రెయిన్‌లో జపోరిజియా తరవాత రెండో అతిపెద్ద అణు విద్యుత్కేంద్రమైన పిన్‌ డెనూ క్రెయిన్స్క్‌కు కేవలం 300 మీటర్ల దూరంలోనే రష్యా క్షిపణి ఒకటి పేలింది. సోమవారం జరిగిన ఈ దాడి తర్వాత అణు రియాక్టర్లు బాగానే ఉన్నా ఇతర యంత్రాలు దెబ్బతిన్నాయి. దీన్ని అణు ఉగ్రవాదంగా  ఉక్రెయిన్‌ అధికారులు తెగనాడారు. క్షిపణి దాడి వల్ల అణు కేంద్రానికి సమీపంలోని ఒక జల విద్యుత్కేంద్రం తాత్కాలికంగా మూతపడిరది. ఉత్తరాన ఉన్న విద్యుత్కేంద్రాలపై, దక్షిణాన ఒక ఆనకట్ట మీద కూడా రష్యా దాడి చేసింది. రష్యన్‌ కేంద్రాలపై ఉక్రెయిన్‌ దాడులకు తెగబడితే తమ ప్రతి చర్య చాలా తీవ్రంగా ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవల హెచ్చరించారు. తదనుగుణంగా ఉక్రెయిన్‌లో పలు పట్టణాలపై రష్యా క్షిపణులు వచ్చిపడుతున్నాయి.

 

Tags :