ఉక్రెయిన్ కీలక నిర్ణయం .. జులై ఒకటి నుంచి అమలు

ఉక్రెయిన్ కీలక నిర్ణయం .. జులై ఒకటి నుంచి అమలు

రష్యా పౌరుల విషయంలో ఉక్రెయిన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వీసా తీసుకొనే తమ దేశంలో అడుగుపెట్టాలని పేర్కొంది. జులై ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. గతంలో ఈ నిబంధన ఉండేది కాదు. రష్యా పౌరులు ఎలాంటి వీసాలు లేకుండానే ఉక్రెయిన్‌ను సందర్శించేవారు. మరోవైపు డాన్‌ బాస్‌ ప్రాంతంలో రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఉక్రెయిన్‌ సైన్యం ఒక ప్రకటన చేసింది. నల్లసముద్రంలో స్నేక్‌ ఐలాండ్‌ సమీపంలో రష్యా నౌకాదళానికి చెందిన నౌకను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.

 

Tags :