MKOne Telugu Times Youtube Channel

విజయం ఎవరిదైనా భారీ మూల్యం తప్పదు

విజయం ఎవరిదైనా భారీ మూల్యం తప్పదు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలై 4 నెలలు అవుతోంది. ఎటూ తేలని ఈ పంచాయితీ మరికొన్నేళ్ల పాటు కొనసాగుతుందని నాటో కూటమి చీఫ్‌ జేమ్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ వ్యాఖ్యానించారు. అయినా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధ సాయాన్ని ఆపోద్దని సూచించారు. ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడో ఎవరూ చెప్పలేరు. ఇది వాస్తవం. దీన్ని పశ్చిమ దేశాలు అంగీకరించాలి. అధునాతన ఆయుధ సామగ్రిని అందిస్తే తూర్పు ఉక్రెయిన్‌ నుంచి రష్యాను వెళ్లగొట్టొచు అన్నారు. సైనికులను పంపి నాటో నేరుగా యుద్ధంలో పాల్గొనదని, మద్దతుగా మాత్రం నిలుస్తుందని స్టోల్టెన్‌బర్గ్‌ స్పష్టం చేశారు. నాటోలో ఉక్రెయిన్‌ చేరిక యత్నాలపై ఆగ్రహంతోనే రష్యా యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. కాగా సైనిక మద్దతు పరంగానే కాక ఆహార, ఇంధన ధరల పెరుగుతలతోనూ ఈ యుద్ధంలో మూల్యం ఎక్కువగా చెల్లించుకోవాల్సి వస్తోందని స్టోల్టెన్‌బర్గ్‌ అన్నారు. రష్యా తన సైనిక ఉద్దేశాలను గనుక సాధిస్తే ఇంతకంటే ఎక్కవ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

 

Tags :