పుతిన్ పదవి నుంచి తప్పుకోక తప్పదా?

పుతిన్ పదవి నుంచి తప్పుకోక తప్పదా?

ఉక్రెయిన్‌పై రష్యా గత రెండు నెలలకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్‌ మేజర్‌ జనరల్‌ బుడనోవ్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం రాజధాని కీవ్‌లో ఆగస్టు మధ్య నాటికి ఒక కీలకమైన మలుపు తీసుకుని ఈ ఏడాది చివరికల్లా ముగుస్తుందని అంచనా వేశారు. ఒక వేళ ఉక్రెయిన్‌లో గనుక రష్యా ఓడిపోతే పుతిన్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పుకోక తప్పదని, అతని దేశం కుప్ప కూలుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇది చివరికి రష్యాన్‌ ఫెడరేషన్‌ నాయకత్వ మార్పుకు దారితీస్తుందని అన్నారు. ఇప్పటికే పుతిన్‌ తిరుగుబాటు జరుగుతోందని, దాన్ని ఆపడం అసాధ్యం అని తెలిపారు. పుతిన్‌ అనారోగ్యం గురించి కూడా ప్రాస్తావించారు.  పుతిన్‌ మానసిక స్థితి కూడా బాగొలేదని అన్నారు. అదీగాక పుతిన్‌  ఆరోగ్యంపై పలు నివేదికలు ఇప్పటికే రకరకాల ఊహాగానాలకు తెరలేపుతున్న సంగతి తెలిసిందే.

 

Tags :