ఆమెపై ఎలాంటి దర్యాప్తు చేయలేం : రిషి సునాక్

భారత సంతతికి చెందిన బ్రిటన్ హోంమంత్రి సువెల్లా బ్రేవర్‌మన్ స్పీడ్ డ్రైవింగ్ వివాదంపై ప్రధానమంత్రి రిషి సునాక్ స్పంందించారు. ఈ ఘటనలో ఆమె ఎలాంటి మంత్రిత్వ నిబంధనలను ఉల్లంఘించలేదని తెలిపారు. అందువల్ల ఆమెపై ఎలాంటి దర్యాప్తు చేపట్టబోమని స్పష్టం చేశారు. స్పీడ్ డ్రైవింగ్ చేసినందుకు గాను తనకు పడిన ఫైన్ పాయింట్లను దాచిపెట్టేందుకు సుయెల్లా ప్రయత్నించారని ఆమెపై విమర్శలు వచ్చాయి. ఇందులో ఆమె పేరు బయటకు రాకుండా ఉండేలా, ఆమె రాజకీయ సాయం కోరడం దుమారం రేపింది. దీంతో బ్రేవర్‌మన్ తీరుపై మండిపడ్డ విపక్షాలు ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండు చేశాయి. ఈ నేపథ్యంలో దీనిపై రిషి సునాక్ స్పందించారు. ఈ వ్యవహారం మినిస్టీరియల్ కోడ్ ఉల్లంఘన కిందకు రానందున, దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని నిర్ణయించాం అని ప్రధాని వెల్లడిరచారు. అయితే, ఈ వ్యవహారంపై అవాస్తవాలు వ్యాప్తి కాకుండా తగిన విధంగా స్పందించాలని బ్రేవర్‌మన్‌ను ఆయన సూచించారు.