చెల్లెలు అంతిమ యాత్రలో పాడె మోసిన బాలయ్య

చెల్లెలు అంతిమ యాత్రలో పాడె మోసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ  తన చెల్లెలు కంఠమనేని ఉమా మహేశ్వరి అంతిమ యాత్రలో పాల్గొన్నాడు. చెల్లెలి పాడెను మోస్తూ బాలయ్య కంటతడి పెట్టేశాడు. నందమూరి ఫ్యామిలిలో విషాదం నెలకొన్న సంగతి అందరికి తెలిసిందే.. స్వర్గీయ ఎన్టీఆర్ చిన్న కూతురు కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలత చెందేలా చేసింది. మరీ ముఖ్యంగా నందమూరి కుటుంబసభ్యులను ఈ ఘటన తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఇక ఆమె అంతిమ క్రియల్లో నందమూరి బాలకృష్ణ కన్నీరుమున్నీరయ్యాడు. చెల్లెలి చివరి వీడ్కోలులో కంటతడి పెట్టేసుకున్నాడు. చెల్లెలి పాడెను బాలయ్య మోశాడు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లోనే ఉమామహేశ్వరి ఉరి వేసుకుని మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు, మనోవేదన కారణంగా ఆమె తన ఉరివేసుకొన్నట్టు తెలుస్తోంది. ఉమామహేశ్వరి ఆత్మహత్యకు సంబంధించి పోస్టుమార్టం నివేదిక నేడు రానుంది. జూబ్లీహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ రోజు ఉమామహేశ్వరి అంతక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో జరిగాయి.

ఉమామహేశ్వరి సోదరులు ఆమె పాడెను మోశారు. వీరిలో నందమూరి బాలకృష్ణ తన చెల్లెలి పాడెను మోశారు. కంటతడి పెడుతూ.. బరువెక్కిన హృదయంతో బాలయ్య ఉమామహేశ్వరికి చివరి వీడ్కోలు పలికాడు. పలువురు సినీ , రాజకీయ నాయకులు ఉమామహేశ్వరి అంత్యక్రియలను హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ విదేశాల్లో ప్రస్తుతం వెకేషన్‌లో ఉండటంతో రాలేకోయాడు. ఉమామహేశ్వరికి ఇద్దరు కుమార్తెలు. ఒకరు దీక్షిత మరొకరు విశాల. వీరిలో విశాల అమెరికాలో ఉంటున్నారు. ఉమా మహేశ్వరి మృతికి సంబంధించిన సమాచారాన్ని దీక్షితనే పోలీసులకు సమాచారాన్ని అందించిన సంగతి తెలిసిందే.

బాధలో బాలయ్య ఉంటే.... సెల్ఫీ అడిగిన అభిమాని చెంప చెళ్లుమనిపించిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ అభిమానుల్ని ఎంత ప్రేమిస్తారో.. తేడాలొస్తే తాట కూడా అదే రేంజ్‌లో తీస్తారు. లిమిట్స్ దాటితే అభిమాని లేడు ఎవడూ లేడు.. చెంప పగలకొట్టడానికి కూడా వెనకాడరు. తన ముందు బిత్తిరి వేషాలు వేస్తే ఎవడికైనా గూబగుయ్ మనాల్సిందే. కొంతమంది అభిమానుల అత్యుత్సాహం సెలబ్రిటీలను చాలా ఇబ్బంది పెడుతుంటుంది. సమయం, సందర్భంతో పనిలేకుండా స్థాయి దిగజారి ప్రవర్తిస్తూ చాలా చిరాకు తెప్పిస్తుంటారు. చెల్లెలు ఉమామహేశ్వరి అంత్యక్రియల్లో నందమూరి బాలకృష్ణకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. చెల్లెలు చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నారు బాలకృష్ణ. బుధవారం నాడు అంత్యక్రియలకు హాజరయ్యారు బాలయ్య. చెమ్మగిల్లిన కళ్ళతో.. బరువెక్కిన గుండెతో చెల్లెలి పాడే మోసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు బాలయ్య. చెల్లెలు అంతిమ యాత్రలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి విషాద సమయంలో కూడా ఓ వ్యక్తి.. బాలయ్య దగ్గరకువచ్చి సెల్ఫీ తీసుకుంటూ తెగ ఇబ్బంది పెట్టాడు. పుట్టెడు దు:ఖంలో ఉన్న బాలయ్యను సెల్ఫీ అడిగేశాడు. వాడి చెంప చెళ్లుమనిపించిన బాలయ్య.

 

Tags :