ప్రపంచ దేశాలకు ఐరాస చీఫ్ హెచ్చరిక.. 2023లో కూడా

ప్రపంచ దేశాలకు ఐరాస చీఫ్ హెచ్చరిక.. 2023లో కూడా

పెరుగుతున్న ఆహారం కొరత కారణంగా రానున్న కాలంలో ప్రపంచ దేశాలు తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐరాస చీఫ్‌ గుటెరస్‌ హెచ్చరించారు. బెర్లిస్‌లో జరిగిన సదస్సులో సంపన్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కాగా ఆయన  ఈ సందేశం ఇచ్చారు. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి పెరుగుతున్న అసమానతల కారణంగా ఇప్పటికే కోట్ల మంది ప్రజలు ప్రభావితం కాగా 2022లో మరిన్ని కరవు కటకాలు సంభవించే అవకాశం ఉందని, 2023 ఏడాది కూడా ఘోరంగా ఉండొచ్చని హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎరువులు, ఇంధన ధరలు పెరగడంతో రైతులు కూడా ఇబ్బండి పడుతున్నారని, దీంతో ఆసియా, ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో పంటలు దెబ్బతింటాయని హెచ్చరించారు.

 

Tags :