MKOne TeluguTimes-Youtube-Channel

ఎమ్మెల్సీలుగా ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు... ఏకగ్రీవ ఎన్నిక

ఎమ్మెల్సీలుగా ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు... ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే నాటికి నాలుగు నామినేషన్లు దాఖలు కాగా, అందులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన పాలమూరి కమల నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మిగిలిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, నవీన్‌ కుమార్‌ కూర్మయ్యగారి నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయినట్లుగా వెల్లడించారు. నేడు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అనంతరం బరిలో ముగ్గురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మాత్రమే ఉండటంతో ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. ఈ మేరకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ నుంచి ఈ ముగ్గురు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు.

 

 

Tags :