ప్రపంచంలోనే భారతీయులు మొదటి స్థానం

ప్రపంచంలోనే  భారతీయులు మొదటి స్థానం

విదేశాలకు వలసబాటపడుతున్న వారిలో ప్రపంచంలోనే భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. విద్య, ఉపాధి అవకాశాల కోసం అత్యధికంగా భారతీయులు విదేశాలకు వెళుతున్నారని ఐక్య రాజ్యసమితి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ అఫైర్స్‌ (యూఎన్‌డీఈఎస్‌ఏ) ఇంటర్నేషనల్‌ మైగ్రేషన్‌ పేరిట విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. భారత్‌లో జన్మించిన 2020 నాటికి విదేశాల్లో స్థిరపడినవారు 1.80 కోట్లమంది ఉన్నారని  ఆ నివేదిక తెలిపింది.  జన్మించిన దేశాన్ని విడిచిపెట్టి విదేశాల్లో ఉన్నవారిలో ప్రపంచంలోనే భారతీయులు మొదటిస్థానంలో ఉన్నారు. ఈ విధంగా 2020 నాటికి 1.80 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో స్థిరపడ్డారు. 2020లో 7.20 లక్షల మంది, 2021లో 8.30 లక్షల మంది భారతీయులు విదేశాలకు వలస వెళ్లారు. 2020లో జులై నాటికే 13 లక్షల మంది విదేశాలకు వలస వెళ్లడం గమనార్హం. విదేశాలకు వలస వెళుతున్నవారిలో భారతీయల తర్వాత మెక్సికన్లు, రష్యాన్లు, చైనీయులు, సిరియన్లు వరుస స్థానాల్లో ఉన్నారు.

 

 

Tags :