ఢిల్లీ లో వికసించిన బతుకమ్మ

ఢిల్లీ లో వికసించిన బతుకమ్మ

ఢిల్లీ లో బతుకమ్మ సంబరాలతో తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు దక్కిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ విమోచన దినోత్సవాల్లో భాగంగా ఢిల్లీ లో బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆద్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఆయన ప్రారంభించారు. కేంద్ర పర్యాటకశాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి, కిషన్‌ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బండా కార్తీక రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి, సినీ నటి జీవిత రాజశేఖర్‌ తదితరులు బతుకమ్మ ఆడారు. వేడుకల్లో కేంద్ర మంత్రులు శర్బానంద సోనో వాల్‌, డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అజయ్‌ భట్‌, అన్నపూర్ణ దేవి, పలువురు కేంద్రమంత్రుల సతీమణులు పాల్గొన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.