పాస్‌పోర్ట్‌ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర విదేశాంగ మంత్రి

పాస్‌పోర్ట్‌ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర విదేశాంగ మంత్రి

సికింద్రాబాద్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌ సందర్శించారు. ఎలాంటి అవాంతరాలు కలగకుండా దరఖాస్తుదారులకు సేవలందిస్తున్న సిబ్బంది పనితీరును ఆయన మెచ్చుకున్నారు. కరోనా సడలింపుల తర్వాత దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ కార్యాలయాలకు అనేక దరఖాస్తులు వచ్చాయని, ఇది సిబ్బందిపై కొంత పనిభారం పెంచినా ఎక్కడా సేవల్లో లోపం రాకుండా సేవలందిస్తుండటం గొప్ప విషయంగా ఆయన అభివర్ణించారు. ఆయన వెంట రీజనల్‌ పాస్ట్‌పోర్ట్‌ ఆఫీసర్‌ దాసరి బాలయ్య తదితరులు ఉన్నారు.

 

Tags :