ఈ నలుగురూ అంతర్జాతీయ ఉగ్రవాదులు : అమెరికా

అఫ్గానిస్థాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులపై అమెరకా కొరడా ఝళిపించింది. అల్‌ఖైదా, పాకిస్థాన్ తాలిబన్‌కు చెందిన నలుగురిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించింది. దీంతో అమెరికాలో వీరికి ఉన్న ఆస్తులన్నీ జప్తు కానున్నాయి. ఇక నుంచి యూఎస్ పౌరులెవరు వీరితో లావాదేవీలు నిర్వహించకూడదు. నిషేధించిన ఉగ్రవాదుల్లో భారత ఉపఖండంలోన అల్‌ఖైదా (ఏక్యూఐఎస్)కు చెందిన ఒసామా మహమూద్, అతిఫ్ యాహ్యా ఘోరీ, మహమ్మద్ మారూప్, తెహ్రీక్ `ఎ`తాలిబన్ (టీటీపీ)కి చెందిన అమ్జద్ ఉన్నారు. ఏక్యూఐఎస్, భారత్, పాక్ ఆఫ్గాన్, మయన్మార్, బంగ్లాదేశ్‌లలో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. టీటీపీని పాకిస్థాన్ తాలిబన్ అని కూడా అంటారు. ఇది అఫ్గాన్ `పాక్ సరిహద్దుల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.
Tags :