పర్యాటక వీసాలకు పచ్చజెండా

పర్యాటక వీసాలకు పచ్చజెండా

అమెరికాకు వెళ్ళాలనుకునే పర్యాటకులు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతకొంతకాలంగా నిలిపివేసిన టూరిస్ట్‌ వీసాల అపాయింట్‌మెంట్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తాజాగా అమెరికా ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ‘‘2022 సెప్టెంబరులో రొటీన్‌ ఇన్‌ పర్సన్‌ టూరిస్ట్‌ వీసా అపాయింట్‌మెంట్‌లను పునఃప్రారంభిస్తున్నాము. గతంలో షెడ్యూల్‌ చేసిన ప్లేస్‌హోల్డర్లు ఇప్పుడు రద్దు చేయబడ్డాయి.ప్లేస్‌హోల్డర్‌ అపాయింట్‌మెంట్‌లు రద్దు చేయబడిన దరఖాస్తుదారులు ఇప్పుడు సాధారణ అపాయింట్‌మెంట్‌లను బుక్‌ చేసుకోవడానికి షెడ్యూలింగ్‌ సిస్టమ్‌లోకి మళ్లీ లాగిన్‌ అవ్వొచ్చు’’ అని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ ప్రకటనతో యూఎస్‌లో ఉంటున్న తమవారిని కలిసేందుకు చాలారోజులుగా ఎదురుచూస్తున్న వేలాదిమందికి ఉపశమనం లభించింది. 

 

Tags :