అన్ స్టాపబుల్..క్యూ లో ఆ ఇద్దరు...

అన్ స్టాపబుల్..క్యూ లో ఆ ఇద్దరు...

ఆహా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ప్రోగ్రామ్ అన్ స్టాపబుల్. నటసింహం సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. వెండితెరపై తనదైన మార్కు సినిమాలతో , మాస్ డైలాగ్స్ తో ప్రేక్షకులని ఉర్రూతలూపిన బాలయ్య " ఆహా " కోసం స్టార్ట్ చేసిన " అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె " రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే, ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో రీసెంట్ గా సీజన్ 2 ని స్టార్ట్ చేసారు. ప్రెజెంట్ ఈ సీజన్ కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటుంది.

ఫస్ట్ సీజన్ ని సినిమా సెలెబ్రేటిస్ తో నడిపిస్తే, సెకండ్ సీజన్ లో పొలిటికల్ లీడర్స్ కూడా ఎంట్రీ ఇస్తుండడం విశేషం.

సీజన్ 2 ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు అతని తనయుడు నారా లోకేష్ తో ప్రారంభించిన విషయం తెలిసిందే. తర్వాత యంగ్ హీరోస్ విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ ఆహా సెట్స్ పైన సందడి చేశారు.

వెనువెంటనే హీరో శర్వానంద్ , అడవిశేష్ బాలయ్యను ఆటపట్టించడం జరిగింది. అందుకే మీలాంటివాళ్ళని షో కి ఇన్వైట్ చేయకూడని బాలయ్య సెటైర్ వేయడంతో నవ్వుల పువ్వులు విరిశాయి. ఇలా ప్రతి ఎపిసోడ్ దేనికదే స్పెషల్ గా ఉంటూ ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది.

రీసెంట్ గా అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, ఏ. కొండరామిరెడ్డి, కె. రాఘవేంద్ర రావు గారికి సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 2 న రాత్రి 9 గంటలకి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. దీనికోసం నెటిజన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటె సీజన్ 2 ని మరింత స్పెషల్ గా మార్చబోతున్నారట. ఎపిసోడ్స్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా చేయడానికి క్రేజీ స్టార్స్ ని ఇన్వైట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రానున్న ఎపిసోడ్స్ లో ప్రభాస్, గోపీచంద్ సందడి చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు కళాతపస్వి కె. విశ్వనాథ్ గారితో ఆహా వర్చువల్ టాక్ షో ని కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు.

అలనాటి క్రేజీ హీరోయిన్లు జయసుధ, జయప్రద ఈ షోలో పాల్గొంటున్నారు అని, ఇప్పటికే వారితో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ తో బాలయ్య టాక్ షో ఎలా ఉండబోతుందో చూడాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే...

 

 

Tags :