అయోధ్యలో యోగి ఆదిత్యనాథ్‌కు గుడి

అయోధ్యలో యోగి  ఆదిత్యనాథ్‌కు గుడి

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అయోధ్య జిల్లాలో ఆయన అభిమానులు గుడికట్టారు. రాముడి అవతారంగా యోగి ఆదిత్యనాథ్‌ను పేర్కొంటూ పూజా కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు.  భరత్‌కుండ్‌ కేంద్రంగా నిర్మించిన ఈ గుడిలో యోగి విగ్రహానికి హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యూపి సీఎం యోగి భక్తుడిగా పేర్కొన్న ప్రభాకర్‌ మౌర్య అయోధ్యకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూర్వా గ్రామంలో ఈ దేవాలయం నిర్మించాడు. ప్రభాకర్‌ వృత్తిపరంగా ఉత్సవాల్లో భక్తిగీతాలు పాడుతుంటారు. 1980లో టీవీ ధారావవాహిక రామాయణం పోలికలతో యోగి విగ్రహాన్ని రూపొందించార. రూ.8.5 లక్షల వ్యయంతో గుడిని నిర్మించినట్లు అంచనా. విగ్రహాన్ని మౌర్య స్నేహితుడు రెండు నెలల్లో రూపొందించాడని ఆయన వివరించారు. ఆయోధ్యలో రామజన్మభూమి ప్రాంతంలో దేవాలయ నిర్మాణంలో యోగి కీలకపాత్ర పోషించారని మౌర్య పేర్కొన్నాడు. 

 

Tags :