గోపురం ఫొటో షేర్ చేసిన ఉపాసన, ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ అయినా లెక్క చేయని ఉపాసన కొణెదల

గోపురం ఫొటో షేర్ చేసిన ఉపాసన,  ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ అయినా లెక్క చేయని ఉపాసన కొణెదల

రీసెంట్‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల షేర్ చేసిన గోపురం పోస్ట్‌ను ఉద్దేశించి నెటిజ‌న్స్ ఫైర్ అవుతున్నారు. అందుకు కార‌ణం ఆ గోపురంపై సినిమా న‌టీన‌టులు ఉంట‌మే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల గురించి తెలుగు వారికి ప్ర‌త్యేక‌మైన ప‌రిచయం అక్క‌ర్లేదు. ఆమె  సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సినిమా రంగంతో ట‌చ్ లేక‌పోయినా సినీ సెల‌బ్రిటీలతో ఉపాస‌న‌కు మంచి అనుబంధ‌మే ఉంది. ఫిట్‌నెస్‌కు సంబంధించిన మ్యాగ‌జైన్‌ను నిర్వ‌హిస్తూ సినీ సెల‌బ్రిటీస్ అయిన స‌మంత‌, ర‌కుల్ వంటి వారితో ప్ర‌త్యేక‌మైన వీడియో ప్రోగ్రామ్స్ కూడా చేయించారు ఉపాస‌న కొణిదెల‌. త‌న‌కు న‌చ్చిన ఫొటోలు, వీడియోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఉపాస‌న కొణిదెల గుడి గోపురం పోస్ట్‌ను షేర్ చేశారు.

సాధార‌ణంగా గుడి గోపురాల‌పై దేవుళ్ల ఫొటోలు మాత్ర‌మే ఉంటాయి. కానీ ఉపాస‌న షేర్ చేసిన గోపురం పోస్ట్‌లో సినీ తార‌ల బొమ్మ‌లున్నాయి. ఇండియ‌న్ సినిమాకు సంబంధించిన తార‌లంద‌రూ ఆ గుడిగోపురంపై ఉన్నారని, తాను, రామ్ చ‌ర‌ణ్ కూడా అందులో కనిపిస్తామ‌ని, శోభ‌నా కామినేని త‌న‌కు ఈ ఫొటోను ఇచ్చార‌ని, గుడి గోపురం ఫొటోను రూపొందిన వ్య‌క్తిని తాను అభినందిస్తున్నాన‌ని ఉపాస‌న పోస్ట్‌తో పాటు కామెంట్స్ కూడా షేర్ చేశారు. అయితే ఈ పోస్ట‌ర్‌పై నెటిజ‌న్స్ ఉపాస‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇలాంటి పోస్టుల‌ను షేర్ చేయ‌డం వ‌ల్ల మీ గౌర‌వం త‌గ్గిపోతుందే త‌ప్ప పెర‌గ‌దని, హిందు దేవుళ్ల‌పై మీకు ఉన్న గౌర‌వం అర్థ‌మ‌వుతుందంటూ కామెంట్స్ పెట్టారు. నెగిటివ్ కామెంట్స్ వ‌చ్చినా ఉపాస‌న ఫొటోను డిలీట్ చేయ‌లేదు. ఇక ఉపాస‌న భ‌ర్త‌, హీరో రామ్ చ‌ర‌ణ్ వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలే. ఇక శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ మ‌రో పాన్ ఇండియా మూవీలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది.

 

Tags :