పుల్లడిగుంట అంగన్‌ వాడి పాఠశాల అభివృద్ధికి ఉప్పుటూరి రామ్‌ చౌదరి విరాళం

పుల్లడిగుంట అంగన్‌ వాడి పాఠశాల అభివృద్ధికి ఉప్పుటూరి రామ్‌ చౌదరి విరాళం

ప్రభుత్వ పాఠశాలలకు దాతలు సహకారం ఉంటే ఆదర్శవంతమైన పాఠశాలగా మారతాయి అనటానికి నిదర్శనం వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంట ఎంపీపీ, అంగన్‌వాడి పాఠశాల.  వంట గది, పాఠశాల ఆవరణ లో పరి శుభ్రత, టాయిలెట్స్‌ , మంచి నీటి వ్యవస్థ చూడటానికి కనువిందుగా ఆహ్లాదకరంగా. పాఠశాలకు ఇంకా చెయ్యాలి అనిపించే విధంగా దాతలు దానిని తీర్చిదిద్దారు.  బాలల హక్కుల దినోత్సవ వారోత్సవాలల్లో భాగంగా ఇటీవల జరిగిన సమావేశంలో అంగన్‌వాడి స్కూల్‌ మాజీ జడ్పీటీసీ సీత మహాలక్ష్మి జవహర్‌ లాల్‌  నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం ఉప్పుటూరి చిన రాములు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఉప్పుటూరి రామ్‌ చౌదరి ఎన్నారై సహకారంతో సుమారు 1 లక్ష రూపాయలతో గోడలపై బొమ్మలు వంట గదికి కావలిసిన కొన్ని వస్తువులు, విద్యార్దులకు ఆట వస్తువులు, వారికదించారు.

ఉప్పుటూరి సీతామహాలక్ష్మీ మాట్లాడుతూ... విద్య వ్యాపారం రాజకీయం కాకూడదు సేవ దృక్పథంతోనే ఉండాలి అని వట్టి చెరుకూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలకు అవసరమైనవి అందించటానికి  మా కుటుంబం ముందుంటుంది అని అన్నారు.  

స్కూల్‌ హెచ్‌ఎం మాట్లాడుతూ ఉప్పుటూరి రామ్‌ చౌదరి మండలంలలో  ఉన్న ప్రభుత్వ పాఠశాలకు అవసరమైనవి పరికరాలను ఇస్తూ  అవగాహన సదస్సులను నిర్వహించారన్నారు.  విద్య దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వాలే చెయ్యాలి అనుకోకుండా నావంతు సహాయం నేను  చేయాలంటూ, అన్ని దానాల్లో విద్య దానం గొప్పది అన్నారు.

 

Tags :