భారత్‌కు అమెరికా భారీగా నిధులు

అంటువ్యాధులు విసురుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ఇందుకోసం తగిన పరిశోధనలు జరుపడానికి భారత్‌కు అమెరికా భారీగా నిధులు ప్రకటించింది. దాదాపు రూ.952 కోట్లను (122 మిలియన్ డాలర్లు) విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ (ఎన్‌ఐఈ)లకు ఈ నిధులు అందజేస్తామని వెల్లడిరచింది. అంటువ్యాధులను నివారించడానికి, ప్రమాదకర వ్యాధులను ముందస్తుగా గుర్తించడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయని తాము ఆశిస్తున్నట్టు పేర్కొంది.
Tags :