ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం

రష్యాకు చిర్రెత్తే పని అమెరికా చేసింది. ఉక్రెయిన్‌కు మరింత ఆర్థిక, ఆయుధ సాయం అందించేందుకు ఉద్దేశించిన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. ఈ బిల్లు ప్రకారం ఉక్రెయిన్‌కు మరో 40 బిలియన్‌ డాలర్ల సాయం అందుతుంది. రష్యాను ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అటు అమెరికా, ఇటు యూరోపియన్‌ దేశాలు అండగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ బిల్లును కాంగ్రెస్‌ ఆమోదించాల్సి ఉంది. ఈ ప్యాకెజీని అత్యవసరంగా కాంగ్రెస్‌ ఆమోదించాల్సి ఉందని బైడెన్‌ కోరారు. ఉక్రెయిన్‌కు అంతరాయం లేకుండా ఆయుధాలు, మానవతా సాయం అందించాలంటే పదిరోజుల్లోగా ఈ బిల్లుకు ఆమోదముద్ర పడాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.