భారత్, అమెరికా మధ్య పరస్పర సహకారం : జాన్‌కెర్రీ

భారత్, అమెరికా మధ్య పరస్పర సహకారం  :  జాన్‌కెర్రీ

గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యాల సాధనలో భారత్‌, అమెరికా పరస్పరం సహకరించుకుంటాయని అమెరికా వాతావరణ ప్రత్యేక రాయబారి జాన్‌కెర్రీ పేర్కొన్నారు. 2030 నాటికి 450 గిగివాట్ల పునరుత్పాదక శక్తిని స్థాపించేందుకు అమెరికా భారత్‌తో కలిసి పనిచేయనుందని ఆయన తెలిపారు. ఆర్థికంగా, సాంకేతికంగా, దానిని సాధించడానికి అవసరమైన ఇతర అంశాలను తీసుకురావడంలో భారత్‌తో భాగస్వామ్యం కోసం మేము ఎదురుచూస్తున్నాము అని పేర్కొన్నారు. క్లైమేట్‌ యాక్షన్‌ అండ్‌ ఫైనాన్స్‌ మోబిలైజేషన్‌ డైలాగ్‌ (సిఎఎఫ్‌ఎండి) ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రి భూపేందర్‌ యాదవ్‌తో జాన్‌ కెర్రీ భేటీ అయ్యారు. గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యాల సాధారణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధారణలో ఈ చర్చలు భారత్‌, అమెరికా మధ్య సహకారానికి శక్తివంతమైన మార్గం ఉపయోగపడతాయని కెర్రీ పేర్కొన్నారు. రెండు దేశాలకు వాతావరణ మార్పులపై సహకారాన్ని పునరుద్ధరించే అవకాశాన్ని సిఎఎఫ్‌ఎండి అందిస్తుందని భేటీ అనంతరం మంత్రి  భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు.

 

Tags :