చైనా కవ్వింపు చర్యలపై... అమెరికా ఆందోళన

చైనా కవ్వింపు చర్యలపై... అమెరికా ఆందోళన

చైనా తరచూ పొరుగు దేశాలను కవ్వించేలా ప్రవర్తించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. బీజింగ్‌ ప్రవర్తన ప్రపంచశాంతికి విఘాతంగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ జెన్‌సాకీ  ఓ ప్రశ్నకు సమాధానంగా స్పందించారు. భారత్‌, చైనా మధ్య 14వ విడత సైనిక చర్చలు ప్రారంభానికి ఒకరోజు ముందు ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. శ్వేతసౌధంలో రోజువారి  ప్రెస్‌ బ్రీఫింగ్‌ సమయంలో అమెరికాతో చైనా చర్చల విషయం ప్రస్తావనకు స్పందించాలని కొందరు కోరారు. దీనికి స్పందించిన సాకీ ఈ సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి మేము పూర్తి మద్దతు ఇస్తామ. ఆ ప్రాంతంలో ప్రపంచంలో మిగిలిన చోట్ల బీజింగ్‌ ప్రవర్తనను ఏ కోణంలో చూడాలో మాకు స్పష్టం తెలుసు. చైనా పొరుగు దేశాలను కవ్వించడంపై ఆందోళన చెందుతున్నాం. ఆ విషయంలో మా భాగస్వాములతో కలసి పనిచేస్తాము అని జెన్‌సాకీ పేర్కొన్నారు.

 

Tags :