ప్రవాస భారతీయులు ఓ శుభవార్త!

అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీయులకు ముఖ్యంగా ప్రవాస భారతీయులకు ఓ శుభవార్త. శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్ కార్డు జారీ ప్రక్రియ త్వరలో వేగవంతం కానుంది. దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి ఆరు నెలలలోపే ప్రక్రియ అంతా పూర్తి అయ్యే విధంగా విధానపరమైన మార్పులు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు 25 మంది సభ్యులతో కూడిన అమెరికా అధ్యక్షుని సలహాదారుల మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే గ్రీన్ కార్డు జారీ ప్రక్రియ వేగవంతం కానుంది. ప్రవాస భారతీయుల సంఘం నాయకుడు అజయ్ జైన్ బుతోరియా గ్రీన్ కార్డుల జారీలో జరుగుతున్న జాప్యం అంశాన్ని సలహామండలి దృష్టికి తీసుకవచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించింది.
Tags :