ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : అమెరికా

ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : అమెరికా

మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. ఇద్దరు బీజేపీ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఆ వ్యాఖ్యలను పార్టీ బహిరంగంగా ఖండిస్తున్నందుకు సంతోషిస్తున్నాం అని అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ మీడియాకు తెలిపారు. మత స్వేచ్ఛ లేదా విశ్వాసాలకు సంబంధించిన మానవ హక్కుల ఆందోళనలపై ఎప్పటికప్పుడు భారత్‌తో సీనియర్‌ అధికారుల స్థాయి సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. మానవ హక్కుల గౌరవాన్ని పెంపొందించే విధంగా భారత్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నామని తెలిపారు. గత నెల 26న ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ, మరో నేత నవీన్‌ జిందాల్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

 

Tags :