అమెరికా రక్షణ బడ్జెట్ భారీగా పెంపు!

అమెరికా రక్షణ బడ్జెట్ భారీగా పెంపు!

అమెరికా మిలటరీ బడ్జెట్‌ రికార్డు స్థాయిలో పెంచనున్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనకు అమెరికా సెనెట్‌ ఆమోద ముద్ర వేసింది. రక్షణ రంగ వ్యయాన్ని 3700 కోట్ల డాలర్లు పెంచాలని అధ్యక్షుడు  బైడెన్‌ చేసిన ప్రతిపాదనకు అమెరికా ఆర్మీ సర్వీసెస్‌ కమిటీ మద్దతిచ్చింది. సెనెట్‌ ఆమోదంతో మొత్తంగా వచ్చే ఏడాది అమెరికా రక్షణ రంగ బడ్జెట్‌ 81 వేల కోట్ల డాలర్లకు మార్గం సుగమం అయింది. త్వరలో అమెరికా ప్రతినిధుల సభ, సెనెట్‌ కలిసి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాయి. ఇంకా ఆ తేదీ ఖరారు కావాల్సి వుంది. నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌ (ఎన్‌డిఎఎ)కు చేసిన సవరణకు ఆర్మీ సర్వీసెస్‌ కమిటీలో అనుకూలంగా 42 ఓట్లు రాగా, 17 మంది వ్యతిరేకించారు.

 

Tags :