కాట్సా నుంచి భారత్ కు మినహాయింపుపై బిల్లు

కాట్సా నుంచి భారత్ కు మినహాయింపుపై బిల్లు

కాట్సా చట్టం ఆంక్షల నుంచి భారతదేశాన్ని మినహాయించాలంటూ అమెరికా కాంగ్రెస్‌ దిగువ సభ ప్రజా ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్‌ సభ్యుడు రో ఖన్నా ఒక ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టారు. ఖన్నాతో పాటు మరో ఇద్దరు సభ్యులు ప్రతిపాదించిన ఈ బిల్లును సభ విదేశీ వ్యవహారాల కమిటీ ఆమోదం కోసం పంపారు. పాలక డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఖన్నా ఇటీవల ఇటువంటి సవరణనే అమెరికా జాతీయ రక్షణ ప్రాధికార చట్టం (ఎన్‌డీఏఏ)కీ ప్రతిపాదించాడు. ఆ సవరణను సభలోని పాలక, ప్రతిపక్షాలు రెండూ ఆమోదించాయి. ఇప్పుడు కాట్సా చట్టానికీ ఇటువంటి సవరణనే ప్రతిపాదిస్తున్నానని ఖన్నా వివరించారు.

 

Tags :