బతుకమ్మ వేడుకలకు అమెరికా కాన్సుల్ జనరల్

బతుకమ్మ వేడుకలకు అమెరికా కాన్సుల్ జనరల్

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో కలిసి ఈ నెల 30న రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని అమ్మపల్లి గ్రామంలో జరిగే ఉత్సవాలకు ఆమె హాజరవుతున్నారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, జాగృతి ఉపాధ్యక్షుడు, టీఎస్‌ ఫుడ్స్‌ చైర్మన్‌ మేడె రాజీవ్‌ సాగర్‌లు అమ్మపల్లి గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మూడువేల మంది మహిళలతో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. కవిత ఆహ్వానం మేరకు జెన్నిఫర్‌  ఈ ఉత్సవాలకు హాజరయ్యేందుకు అంగీకరించారన్నారు.

 

Tags :