డొనాల్డ్ ట్రంప్ ఆర్గనైజేషన్ కు షాక్.. 13 కోట్ల జరిమానా

డొనాల్డ్ ట్రంప్ ఆర్గనైజేషన్ కు షాక్..  13 కోట్ల జరిమానా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చెందిన ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ను ఇక్కడి కోర్టు సుమారు 13 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఒక ఉద్యోగికి 5 నెలల జైలు శిక్ష విధించింది. ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన రెండు అనుబంధ సంస్థల ఉన్నతోద్యోగులు కొందరు పన్ను ఎగవేత సహా 17 ఆర్థిక నేరాలకు పాల్పడటంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక జడ్జి ఎంత వరకు జరిమానా విధించవచ్చో అంత మొత్తాన్నీ (రూ.13 కోట్లు) శిక్షగా విధించడం విశేషం. అయితే ట్రంప్‌ వ్యక్తిగతంగా ఇందులో దోషి కాదు. ఉద్యోగుల పన్ను ఎగవేత గురించి తనకు తెలియదని ఆయన ప్రకటించారు. ఇది డెమోక్రాట్‌ల కుట్రలో భాగమని విమర్శించారు.  ఇందులో తమ పొరపాటేమీ లేదని ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ స్పందించింది. దీనిని హైకోర్టులో అప్పీళు  చేస్తామని తెలిపింది.

 

 

Tags :