డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులకు శిక్ష .. స్పష్టం చేసిన యూఎస్ కోర్టు

డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులకు శిక్ష .. స్పష్టం చేసిన యూఎస్ కోర్టు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చాలని డిమాండ్‌ చేస్తూ అమెరికా పార్లమెంటు క్యాపిటల్‌ భవనంలో డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు చేసిన దాడులను ప్రపంచ దేశాలన్ని విస్తుపోయి చూసిన సంగతి తెలిసిందే. నాటి ఘటనకు కారణమైన వాళ్లుందరికి కఠిన శిక్షలు విధించారు. దీంతో వారంతా కన్నీటీ పర్యంతమవుతూ నాటి ఘటనకు సిగ్గుపడుతున్నాం అని చెబుతున్నప్పటికి శిక్షలు నుంచి తప్పించుకుకోవడం అసాధ్యం అని యూఎస్‌ కోర్టు స్పష్టం చేసింది. అమెరికా పార్లమెంటు దాడుల ఘటనలో ఉద్యోగులు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఇది చాలా క్రూరమైన చర్యగా కోర్టు అభివర్ణించింది. అయితే ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి సుమారు 700 మంది అభియోగాలు ఉన్నాయి. అందులో ఫ్లోరిడా వ్యాపార యాజమాని రాబర్ట్‌  పాల్మెర్కి ఐదేళ్లు జైలు శిక్ష విధించింన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇప్పటి వరకు దాదాపు 71 మందికి శిక్షలు విధించారు.

ఈ మేరకు మొత్తంగా ఇప్పటి వరకు 165 మంది నేరాన్ని అంగీకరించారని, పైగా అందులో ఎక్కువగా ఆరు నెలల గరిష్ఠ శిక్ష విధించే నేరాలకు పాల్పడినవారే. అధికారిక లెక్కల ప్రకారం మూడు నెలలు లేదా అంతకంటే తక్కువ శిక్షలు పొందిన 22 మందితో సహా సుమారు 31 మంది నిందితులకు జైలు శిక్ష విధించబడిరది. మరో 18 మంది నిందితులకు గృహ నిర్భంధం విధించారు. మిగిలిన 22 మంది గృహనిర్బంధం లేకుండానే ప్రొబేషన్‌లో ఉంచారు. అయితే యూఎస్‌లో న్యాయమూర్తులు తరచూ  పశ్చాత్తాపాన్ని శిక్షలను నిర్ణయించడంలో కీలకమైన అంశంగా పేర్కొంటారు.

 

Tags :