వైద్యరంగంలో మరో అద్బుతం!

వైద్యరంగంలో మరో అద్బుతం!

వైద్యరంగంలో మరో అద్భుతం. అమెరికాకు చెందిన వైద్య బందం మొట్టమొదటిసారిగా జన్యుపరంగా మార్పులు చేసిన ఓ పంది గుండెను ఓ వ్యక్తికి విజయవంతంగా అమర్చింది. ఈ శస్త్రచికిత్స నిర్వహించిన యూనివర్సిటీ ఆఫ్‌ మేరిల్యాండ్‌ మెడికల్‌ సెంటర్‌ తాజాగా  ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మేరీల్యాండ్‌కు చెందిన డేవిడ్‌ బెన్నెట్‌(57) హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సాంప్రదాయ హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, కృత్రిమ పంపింగ్‌కు ఆయన శరీరంలో సహకరించకపోవడంతో వైద్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మానవ శరీరంలో పొసగేలా జన్యు సవరణలు చేసిన ఓ పంది గుండెను సేకరించి ఆయనకు విజయవంతంగా అమర్చారు. శస్త్రచికిత్స జరిగిన మూడు రోజులు కాగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మరోవైపు వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

 

Tags :