భారత్ లో బిజినెస్ వీసాల జారీ వేగవంతం : అమెరికా

కొన్ని రకాల వీసాలు, గ్రీన్‌కార్డుల ప్రక్రియలను ప్రీమియం ప్రాసెసింగ్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. తమ వలసవిభాగం వ్యవస్థపై ఉన్న బరువును తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వ-వలససేవల సంస్థ (యూఎస్సీఐఎస్) స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చిలో ఐ-765 దరఖాస్తు పెండిరగ్లో ఉన్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) ఎఫ్-1, స్టెమ్ ఓపీటీ ఎఫ్-1 విద్యార్థులకు ప్రీమియం ప్రాసెసింగ్‌ను మొదలుపెడతాం. ఏప్రిల్‌లో తిరిగి ఇవే రకం వీసాల్లో ఐ-765 దరఖాస్తును నింపుతున్న విద్యార్థులను ప్రీమియం ప్రాసెసింగ్ విభాగంలోకి తీసుకొస్తాం అని తెలిపింది. ఇన్నాళ్లూ ఐ-129, ఐ-140 దరఖాస్తులను నింపే అభ్యర్థులకు మాత్రమే ప్రీమియం ప్రాసెసింగ్ అందుబాటులో ఉండేది. మరోవైపు భారత్‌లో బిజినెస్ వీసాల జారీ ప్రక్రియను మరింగ వేగవంతం చేసేందుకు పలు చర్యలను తీసుకుంటున్నామని, ఈ దిశగా ఇప్పటికే ప్రగతిని సాధించామని అమెరికా పేర్కొంది. భారత్‌లో తమ సిబ్బందిని సైతం గణనీయంగా పెంచినట్లు అమెరికా ప్రపంచ మార్కెట్ల వాణిజ్య విభాగ సహాయ కార్యదర్శి అరుణ్ వెంకటరామన్ స్పష్టం చేశారు.