ఆమెది అనధికారిక పర్యటన : అమెరికా వివరణ

అమెరికా చట్టసభ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించడం ఇటీవల పదవీచ్యుడుతైన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ అవడం పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అమెరికా స్పందించింది. ఆమెది అనధికారిక పర్యటన అని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవానికి ఇల్హాన్ నాలుగు రోజుల పర్యటనకు గాను ఈ నెల 20న పాకిస్థాన్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే అదే రోజు వీవోకేలో పర్యటించారు. అంతేకాదు పీవోకేపై అమెరికా శ్రద్ద అవసరమన్నారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. సంకుచిత బుద్ధితో కూడిన పర్యటన అని వ్యాఖ్యానించింది. దీంతో ఆమెది అనధికార వ్యక్తిగత పర్యటన అని, పాక్ పై అమెరికా ప్రభుత్వ విధానాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని అమెరికా విదేశాంగ మంత్రి సలహాదారు అయిన డెరెక్ చొల్టెట్ తెలిపారు. ఆమె పర్యటనకు విదేశాంగ శాఖతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆమె వ్యక్తిగతంగా పాక్ పర్యటనకు వెళ్లారని తేల్చి చెప్పారు.