సంక్షోభం దిశగా అమెరికా ఆర్థిక వ్యవస్థ!

సంక్షోభం దిశగా అమెరికా ఆర్థిక వ్యవస్థ!

అమెరికా జూన్‌ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి లేకపోగా 0.9 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. అగ్రరాజ్య జీడీపీ క్షీణతతో ఉండడం వరుసగా ఇది రెండవ త్రైమాసికం. మార్చి త్రైమాసికంలో ఎకానమీ 1.6 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. వరుసగా రెండు త్రైమాసికాలు ఎకనామీ క్షీణ బాటలో ఉంటే దానిని అనధికారికంగా (సాంకేతికంగా) మాంద్యంగానే పరిగణిస్తారు. తాజా పరిస్థితిని క్షీణతగా ఎంత మాత్రం భావించరాదని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫైడ్‌ చైర్మన్‌ జెరోమీ పొవెల్‌ పేర్కొంటున్నారు. ఎకానమీలో పలు రంగాలు పటిష్టంగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను క్షీణతలోకి జారిందని పేర్కొనడం సరికాదన్నది వారి వాదన. తీవ్ర ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు వంటి పరిణామాల నేపథ్యంలో రుణ వ్యయాలు పెరిగిపోయి అమెరికా వినియోగదారులు, వ్యాపారులు తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు.

 

Tags :