టూరిస్టులకు అమెరికా గ్రీన్ సిగ్నల్

టూరిస్టులకు అమెరికా గ్రీన్ సిగ్నల్

టూరిస్టులకు అగ్రరాజ్యం అమెరికా ఆహ్వానం పలుకుతుంది. అమెరికా తన సరిహద్దుల్ని తెరవనున్నది. రెండు డోసుల కోవిడ్‌ తీసుకున్న వారికి ఆహ్వానం పలుకుతోంది. మెక్సికో, కెనడా సరిహద్దుల్ని నవంబర్‌లో తెరవనున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న టూరిస్టులకు మాత్రమే ప్రస్తుతం అనుమతి ఇవ్వనున్నారు. విదేశీ ప్రయాణికులకు సంబంధించిన పూర్తి స్థాయి కొత్త విధానాన్ని త్వరలో ప్రకటించనున్నారు. ప్రయాణంపై ఆంక్షలను సడలించాలని చాన్నాళ్ల నుంచి మెక్సికో, కెనడా దేశాలు అమెరికాను కోరుతున్నాయి. విమాన ప్రయాణికులు కూడా వ్యాక్సినేట్‌ అయి ఉండాలి. వాహనాలు, రైళ్లు, ఫెర్రీల ద్వారా అమెరికాలోకి ఎంటర్‌ అయ్యేవాళ్లు వ్యాక్సిన్‌ రిపోర్ట్‌ చూపించాలని బోర్డర్‌ అధికారులు చెబుతున్నారు. 19 నెలల విరాహం తర్వాత మళ్లీ సరిహద్దుల ద్వారా విదేశీ టూరిస్టులకు అనుమతి ఇవ్వనున్నారు.

 

Tags :