భారత్ లో వీసాల జారీ ప్రక్రియ వేగవంతం : అమెరికా

భారతదేశంలో వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి బైడెన్ పాలకవర్గం కృషి చేస్తోందని, ఫారిన్ సర్వీస్ సిబ్బంది నియామకాన్ని కూడా పెంచిందని అమెరికా తెలిపింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ప్ఖియరీ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 1,000 రోజులకు పైగా నడుస్తుంది. వీసా సేవల యొక్క ముఖ్యమైన డిమాండ్‌కు ప్రతిస్పందించడానికి మేము ఇంకా కృషి చేస్తున్నాము అని జీన్ పియర్ తెలిపారు. వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాన్ని విజయవంతంగా తగ్గిస్తున్నాము. ఇందుకోసం యూఎస్ ఫారిస్ సర్వీస్ సిబ్బందిని రెట్టింపు చేసాము. వీసా ప్రాసెసింగ్ అంచనా వేసిన దానికంటే వేగంగా కోలుకుంటుంది. ఈ సంవత్సరం మేము ప్రీ పాండమిక్ ప్రాసెసింగ్ స్థాయిలను చేరుకుంటామని భావిస్తున్నామము అని తెలిపారు. ఈ వారం సమావేశంలో ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయిలు మరియు పసిఫిక్ ద్వీపవాసులపై అధ్యక్షుడి సలహా సంఘం, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలోని ఎంబసీలలో వీసా అపాయింట్మెంట్ సమయాల్లో పెరుగుతున్న జాప్యాన్ని తగ్గించడానికి వైట్‌హౌస్‌కి కొన్ని సిఫార్సులు చేసింది. అధిక బ్యాక్‌లాగ్‌లను తగ్గించడానికి వర్చువల్ ఇంటర్వ్యూలను నిర్వహించడంలో సహాయపడటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాయబార కార్యాలయాల నుండి వర్చువల్ ఇంటర్వ్యూలు, సిబ్బంది, కాన్సులర్ సిబ్బందిని అనుమతించాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది.