అమెరికా నిర్ణయం.. భారత్ కు పెద్ద ఊరట

అమెరికా నిర్ణయం.. భారత్ కు పెద్ద ఊరట

రష్యా సహా తన శత్రు దేశాల నుంచి ఆయుధాలు, నిఘా సమాచార మార్పిడికి పాల్పడే దేశాలపై కాట్సా పేరుతో విధించే ఆంక్షల నుంచి భారత్‌కు మినహాయిస్తూ తీసుకువచ్చిన చట్ట సవరణకు అమెరికా ప్రతినిధుల సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అమెరికా నిర్ణయం భారత్‌కు పెద్ద ఊరట. చైనాతో సరిహద్దులో తరచూ ఘర్షనలు జరగడం, ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అత్యాధునిక ఎస్‌`400 క్షిపణి రక్షణ వ్యవస్థలను రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేసేందుకు భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై అప్పటి ట్రంప్‌ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.

భారత్‌ పై కాట్సా (అమెరికాస్‌ ఆడ్వర్సరీస్‌ థ్రూ శాంక్షన్స్‌ యాక్ట్‌`సీఏఏటీఎస్‌ఏ) చట్టం మేరకు ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అయితే, వాటిని పట్టించుకోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రష్యా నుంచి 5ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థల కొనుగోలుకు 5 బిలియన్‌  డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. కాగా బైడెన్‌ అధికారంలోకి వచ్చాన కూడా కాట్సాపై ఆంక్షలపై సన్నాయి నొక్కులు నొక్కినప్పటికీ చివరకు భారత్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. భారత సంతతికి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. చైనాలాంటి దేశాలను నిలువరించాలంటే భారత్‌కు మద్దతు ఇవ్వాలని, అందువల్ల కాట్సా ఆంక్షలను భారత్‌ను మినహాయింంచాలని కోరారు. ఆయన వాదనకు ప్రతినిధుల సభ సాకుకూలంగా స్పందించింది.

 

Tags :