2020 మే తర్వాత ఇదే తొలిసారి : అమెరికా

అమెరికాలో వినియోగదారు ధరలు మరికాస్త నెమ్మదించాయి. 2021 డిసెంబరుతో పోలిస్తే గత నెలలో ద్రవ్యోల్బణం 6.5 శాతానికి పరిమితమైంది. ద్రవ్యోల్బణం వరుసగా ఆరో నెలా తగ్గడం విశేషం. నవంబరులో ఇది 7.1 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. వాస్తవ ధరలు నవంబరు నుంచి డిసెంబరుకు 0.1 శాతం తగ్గాయి. 2020 మే తర్వాత ఇదే తొలి క్షీణత కావడం గమనార్హం. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన చర్యలు కాస్త నెమ్మదిస్తేనే ఈ ఏడాదిలో ద్రవ్యోల్బణం మరింత అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 వరకు ఫెడ్ తన ద్రవ్యోల్బణ లక్ష్యమైన 2 శాతానికి చేరకపోవచ్చన్న అంచనాలున్నాయి. ఈ నెలాఖరులో జరిగే సమావేశంలో ఫెడ్ కనీసం 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లు పెంచొచ్చని భావిస్తున్నారు.
Tags :