అమెరికాలో 1981 తరువాత ఇదే అత్యధికం

అమెరికాలో ద్రవ్యోల్బణం 9.1 శాతానికి చేరింది. 1981 నవంబర్ తరువాత ఇదే అత్యధికం. అమెరికా కార్మిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం జూన్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. వినియోగదారుల ధరల సూచీ 1.3 శాతం పెరగడంతోనే ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదైందని పేర్కొంది. ఆహారం, ఇంధన ధరలు మినహాయించి చూస్తే ఇది 5.9 శాతమని నివేదిక తెలిపింది. ఇంధన ధరలు జూన్లో 11.2 శాతం పెరిగాయి. 12 నెలల కాలంలో వీటి ధరలు 59.9 శాతం పెరిగాయి. ఉక్రెయిన్ సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయని నివేదిక తెలిపింది. గత నెలలో గ్యాలన్ ఇంథనం 5 డాలర్లకు పెరిగింది. అంతకు ముందు నెలలో పోల్చితే జూన్లో ఆహారం, హాస్సింగ్ ధరలు కూడా పెరిగాయని నివేదిక తెలిపింది.
Tags :