మాస్కోవా మునక వెనుక.. అమెరికా ?

మాస్కోవా మునక వెనుక.. అమెరికా ?

రష్యా యుద్ధనౌక మాస్కోవోపై ఉక్రెయిన్‌ క్షిపణి దాడుల వెనుక అమెరికా హస్తం ఉందా? అంటే అవుననే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. రష్యా నౌకాదళంలోనే అత్యంత ప్రముఖమైన మస్క్‌వా యుద్ధనౌక వల్ల సముద్రంలో మునగడం వెనుక అమెరికా హస్తం ఉందన్న వార్తలు కలకలం సృస్టిస్తున్నాయి. నేరుగా అమెరికా ఈ ఆపరేషన్‌లో పాల్గొనకపోయినా, పూర్తి సహకారమివ్వడాన్ని రష్యా ఎలా తీసుకుంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్‌ 14న మస్క్‌వా నల్ల సముద్రంలో మునిగిపోయింది. తమ నెప్ట్యూన్‌ క్షిపణుల దాడి కారణంగానే అది మునిగిందని ఉక్రెయిన్‌ ప్రకటించింది. దీన్ని రష్యా తీవ్రంగా ఖండించింది. నౌకలో అంతర్గతంగా ప్రమాదం జరిగిందని, ఎలాంటి క్షిపణిదాడి జరగలేదని పేర్కొంది. అగ్ని కీలలు అంటుకున్న సమయంలో 500 మంది సైనిక సిబ్బంది ఆ నౌకలో ఉన్నారు. ఇందులో ఎంత మంది మరణించారు. ఎంత మందికి గాయాలయ్యాన్న విషయాన్ని మాస్కో పేర్కొనలేదు.

రెండో ప్రపంచ యుద్దం తర్వాత రష్యాకు చెందిన అతి పెద్ద యుద్దనౌక మునిగిపోవడం ఇదే తొలిసారి. ఇది పుతిన్‌ సేవకు సైనికపరంగా ఎదురుదెబ్బ. మునక వెనుక తమ నిఘా వర్గాలు కీలక పాత్ర పోషించాయని అమెరికా ఇప్పుడు చెబుతోంది. మస్క్‌వా ఎక్కడుందని ఉక్రెయిన్‌ సైనిక అధికారులు అడిగారు. నల్లసముద్రంలో దక్షిణ ఒడెస్సాకు సమీపంలో ఉందని చెప్పాం అ సమాచారాన్నీ అందించాం అని ఓ అమెరికా అధికారి తెలిపారు.  ఆ సమాచారంతోనే ఉక్రెయిన్‌ క్షిపణి దాడికి పాల్పడిరదని అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

 

 

Tags :