అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరి హతం

అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరి హతం

అల్‌ఖైదా చీఫ్‌ అల్‌ జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో డ్రోన్‌ దాడులు జరిపి అతడ్ని హతమార్చింది. అల్‌ జవహరి మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి అల్‌ జవహరిని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. అల్‌ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించేందుకు జో  బైడెన్‌ అమెరికా సైన్యానికి గతవారం అనుమతిచ్చారు.  ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టిన వారు డ్రోన్‌ దాడులు చేసి ఆల్‌ జవహరిని హతమార్చారు. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని బైడెన్‌ పేర్కొన్నారు. అల్‌ జవహరి మృతితో 9/11 ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని అన్నారు.

 

Tags :