అమెరికాలో భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానం!

అమెరికాలో  భారత్‌కు వ్యతిరేకంగా  తీర్మానం!

అమెరికా పార్లమెంటు ముందుకు భారత్‌కు వ్యతిరేకంగా అసాధారణ రీతిలో ఒక తీర్మానం వచ్చింది. మత స్వాతంత్య్రం ప్రమాదంలో పడిన దేశంగా భారత్‌ను ప్రకటించాలని ఆ తీర్మానం కోరింది. భారత్‌ పట్ల వ్యతిరేకతను, పాకిస్థాన్‌ పట్ల సానుకూలతను బాహాటంగానే ప్రదర్శించే అధికార డెమోక్రటిక్‌ పార్టీ మహిళా ఎంపీ ఇహాన్‌ ఒమన్‌ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు మహిళా ఎంపీలు రషీదా తాలిబ్‌, జువాన్‌ వర్గాస్‌తో కలిసి ప్లామెంటు దిగువ సభలో ఆమె ఈ అంశం లేవనెత్తారు. ఈ తీర్మానాన్ని సభ విదేశీ వ్యవహరాల స్థాయీ సంఘానికి నివేదించింది. దీనిపై అవసరమైన చర్యలను సూచించాలని సంఘాన్ని కోరింది.

 

Tags :