అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

తైవాన్‌ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాల దూకుడు పెరుగుతున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరకు చైనాతో అగ్రరాజ్యం యుద్ధం చేసేలా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా లోని ప్రస్తుత బలహీన, అవినీతి ప్రభుత్వాన్ని చైనా ఏమాత్రం గౌరవిండచం లేదని అన్నారు. త్వరలో చైనా, అమెరికా ఉన్నతస్థాయి అధికారులు స్విట్జర్లాండ్‌లో సమావేశం కానున్నరన్న వార్తల నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని మరోసారి ట్రంప్‌ ఆరోపించారు. అవినీతి ప్రభుత్వం దేశాన్ని ఏలుతోందని విమర్శించారు. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహకరణ సమయంలో బైడెన్‌ ప్రభుత్వం అనుసరించిన తీరును కూడా  ట్రంప్‌ తప్పు పట్టారు.  8,500 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక సైనిక పరికరాలను అఫ్గాన్‌లో వదిలేసి వచ్చాం. ఇప్పుడు వాటిని చైనా, రష్యా రివర్స్‌ ఇంజినీరింగ్‌ ద్వారా సొంతంగా తయారు చేసుకుంటాయి అని ట్రంప్‌ తెలిపారు.

 

Tags :