అమెరికా రాష్ట్రాల చట్టసభల్లోనూ భారతీయ అమెరికన్ల హవా

అమెరికా రాష్ట్రాల చట్టసభల్లోనూ భారతీయ అమెరికన్ల హవా

అమెరికాలోని రాష్ట్రాల చట్టసభల్లోనూ పలువురు భారతీయ అమెరికన్లు విజయం సాధించారు. ప్రతినిధుల సభకు ఈసారి రికార్డు స్థాయిలో ఐదుగురు ఎన్నికైన విషయం తెలిసిందే. వీరంతా అధికార డెమోక్రాట్‌ పార్టీకి చెందినవారు. రాష్ట్రాల చట్టసభలకు ఎన్నికైనవారిలో అరవింద్‌ వెంకట్‌, తారిక్‌ ఖాన్‌ (పెన్సిల్వేనియా), సల్మాన్‌ భోజని, సులేమాన్‌ లలానీ (టెక్సాస్‌), శాంసింగ్‌, రంజీవ్‌ పురి ( మిషిగాన్‌), నబీలా సయ్యద్‌ మేగన్‌ శ్రీనివాస్‌, కవిన్‌ ఒలిక్కల్‌ (ఇల్లినోయీ), నబ్లియా ఇస్లాం, ఫరూక్‌ ముఘల్‌ (జార్జియా), కుమార్‌ భర్వే (మేరీలాండ్‌), అనితా సమాని (ఒహైయో) తదితరులు ఉన్నారు. కౌంటీ జడ్జిలుగా,  కమిషనర్లుగా మరి కొందరు భారతీయ అమెరికన్లు విజయం సాధించారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.