కొవిడ్ తో అమెరికా ప్రజలు కలిసి జీవించాల్సిందే : ఫౌచీ

కొవిడ్ తో  అమెరికా ప్రజలు కలిసి జీవించాల్సిందే : ఫౌచీ

ఒమిక్రాన్‌ విపరీతమైన వేగంతో వ్యాప్తి చెందుతుందని, దీన్ని అడ్డుకోవడం అసాధ్యమని అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ ఈ వేరియంట్‌ ప్రభావానికి లోనవుతారని తెలిపారు. కొవిడ్‌తో అమెరికా ప్రజలు కలిసి జీవించాల్సిందేనని అన్నారు. అమెరికాలోని ప్రఖ్యాత సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ లో ప్రసంగిస్తూ కొవిడ్‌ను అంతం చేయడం అనేది అభూత కల్పనే అని అన్నారు. ఒమిక్రాన్‌కు ఉన్న వ్యాప్తి వేగం కారణంగా అది ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోందని పేర్కొన్నారు. టీకా తీసుకొని వ్యక్తుల కారణంగా వైరస్‌ సమూల నిర్మూలన అసాధ్యమని వెల్లడిరచారు. వ్యాక్సిన్ల సామర్థ్యం కూడా తగ్గుతోందని అన్నారు.

 

Tags :