చరిత్రాత్మక బిల్లుపై జో బైడెన్ సంతకం

చరిత్రాత్మక బిల్లుపై జో బైడెన్ సంతకం

పర్యావరణ పరిరక్షణ, సామాన్యులకు వైద్య బీమా కోసం ఉద్దేశించిన చరిత్రాత్మక బిల్లుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నేడు సంతకం చేయనున్నారు. ఈ బిల్లు ప్రకారం వాతావరణ మార్పులను ఆరికట్టేందుకు అమెరికా పదేళ్ల వ్యవధిలో 375  బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనుంది. ఈ మొత్తం విలువ రూ.30 లక్షల కోట్లతో సమానం. అంతేకాకుండా, వైద్య బీమా ఉన్న అమెరికన్‌ పౌరుడు తన ఏడాది పొడవున వాడే ఏ ఔషధానికి కూడా 2000 డాలర్లకు మంచి తన జేబు నుంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చూడాలని తాజా బిల్లు నిర్దేశించింది. 2000 డాలర్లకు మించిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. దీంతో కోట్ల మంది అమెరికన్లకు మేలు జరగనుంది. ఈ బిల్లుకు ఇప్పటికే అమెరికా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.

 

Tags :