అమెరికా అధ్యక్ష నివాసంపైకి.. దూసుకొచ్చిన విమానం

అమెరికా అధ్యక్ష నివాసంపైకి.. దూసుకొచ్చిన విమానం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నివాసంపైకి పొరపాటున ఓ విమానం దూసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జో బైడెన్‌, ఆయన భార్యా జిల్‌ బైడెన్‌ను రహస్య ప్రాంతానికి తరలించారు. డెలావర్‌లోని రిహోబత్‌ బీచ్‌లో ఉన్న అధ్యక్ష విడిది నివాసానికి బైడెన్‌ కుటుంబం శనివారం వచ్చింది. పొరపాటున ఓ చిన్న విమానం నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది. భద్రతా సిబ్బంది ఆ విమానాన్ని పంపేశారు. ఆ తర్వాత బైడెన్‌ కుటుంబాన్ని బీచ్‌ హౌజ్‌కు తీసుకొచ్చారు.

 

Tags :