ఇది నరమేధమే.. జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు

ఇది నరమేధమే.. జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌లో రష్యా సైనం నర మేధానికి పాల్పడుతోందంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా ఆధారాలు బయటకు వస్తున్నాయని అన్నారు. అసలు ఉక్రెయిన్‌ ఉనికినే తుడిచిపెట్టేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భావిస్తున్నారని మండిపడ్డారు. గత వారంతో పోలిస్తే పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందన్నారు. ఇలాంటి అకృత్యాల గురించి ఇంకా వినబోతున్నాం. రష్యా చర్యలు నరమేధమా?కాదా? అనేది అంతర్జాతీయ న్యాయ నిపుణులు నిర్ధారించాలి. కానీ, ఉక్రెయిన్‌ చెబుతున్నదాని ప్రకారం నిది నరమేధమే అని బైడెన్‌ స్పష్టం చేశారు.

 

Tags :